దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశముగా జన్మించి, లోక కళ్యాణార్థం ఘనకార్యములు చేసిన మహాత్ముడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున అవతరించిరి.
దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు మాహిష్మతినగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగించెను. అతనికి గురువుగా దత్తాత్రేయుడు ఉండెను.
ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి, "గురువర్యా! మీ అనుగ్రహంతో అనేక విషయాలు తెలుసుకొనియున్నాను. కానీ మాఘమాస మహాత్మ్యాన్ని గురించి వినలేదు. మాఘస్నానం విశిష్టత, దానిప్రయోజనాలను నాకు వివరించగలరా?" అని కోరెను.
దత్తాత్రేయుడు ఆయన కోరికను మన్నించి, ఈ విధంగా చెప్పెను:
మాఘమాస స్నాన మహాత్మ్యం
"భూపాలా! భరతఖండములోని పుణ్యనదుల వంటి పవిత్రత మరే నదులకు లేదు. ముఖ్యంగా పన్నెండు నదులు విశేష ప్రాముఖ్యత కలిగి, వీటికి పుష్కర ప్రవేశం కలుగును. బృహస్పతి ఒక్కో సంవత్సరము ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు జరుగును.
ఈ పవిత్ర నదులలో స్నానం చేసి దానధర్మాలు నిర్వహించినచో, దాని ఫలితాన్ని వర్ణించటం కూడా అసాధ్యం. ముఖ్యంగా మాఘమాసంలో నదీస్నానం చేయడం వలన జన్మరాహిత్యం కలుగును. కనుక ప్రతి మానవుడూ మాఘస్నానం తప్పక చేయాలి. మాఘస్నానం చేయని వాడు జన్మజన్మల పాపఫలములను అనుభవించక తప్పదు.
"మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు నదీస్నానం చేసి, సద్బ్రాహ్మణునికి దానం చేసినచో, పంచమహాపాతకాలను చేసినవాడు కూడా ముక్తి పొందగలడు" అని దత్తాత్రేయుడు వివరించెను.హేమాంబరుడు మరణించిన తరువాత, అతని కుమారులు తండ్రి ఆస్తిని పంచుకొని ధనం వ్యర్థంగా ఖర్చు చేసి, చెడువారితో అనుసంధానం చేసుకొనిరి.
ఒకనాడు పెద్ద కుమారుడు అడవిలో పులి నోటికి బలైపోయెను. చిన్న కుమారుడు వేశ్యతో విహరించుచునే త్రాచు పాము కాటుకు గురై చనిపోయెను.
యమదూతలు వారిని యమలోకానికి తీసుకెళ్లగా, చిత్రగుప్తుడు పెద్ద కుమారుని నరకానికి పంపమని, చిన్న కుమారుని స్వర్గానికి పంపమని ఆదేశించెను.
ఆ మాట విని చిన్న కుమారుడు చిత్రగుప్తునితో ఇలా ప్రశ్నించెను:చిత్రగుప్తుడు సమాధానమిస్తూ ఇలా చెప్పెను:
"ఓ వైశ్యపుత్రా! నీవు ప్రతీ రోజూ నీ మిత్రుడిని కలుసుకోవడానికి గంగానదిని దాటి ఆవలి గట్టునికి వెళ్లే వాడవు. మాఘమాసంలో నదిని దాటి ప్రయాణించేటప్పుడు, గంగా జలపు కెరటాలు నీ శిరస్సుపై పడి, నీవు పవిత్రుడవైతివి.
అంతేకాకుండా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతిరోజూ బ్రాహ్మణ దర్శనం చేయుట వలన గోహత్యాది మహాపాతకాలు కూడా నశించును. అదనంగా, ఆ బ్రాహ్మణుడు పఠించే గాయత్రీ మంత్రం నీవు వినియున్నావు.
గంగాజలము నీ శరీరాన్ని తాకినందున, నీ పాపాలు తొలగిపోయాయి. అందుచేతనే నిన్ను స్వర్గానికి పంపించుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను.
మాఘస్నానం ముక్తి మార్గము
ఆ మాట విని వైశ్య కుమారుడు ఆశ్చర్యంతో,
"ఆహా! గంగాజలము నామీద పడినంత మాత్రముననే నాకు ఇంతటి మోక్షం లభించిందా!" అని ఆనందించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్లిపోయెను.
అందుచేతనే, మాఘమాసంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం తప్పక చేయవలసినది. అది జన్మరాహిత్యాన్ని ప్రసాదించి మోక్షాన్ని కలిగించును.
మరిన్ని మాఘ పురాణాలు చూడండి.
0 Comments