నిన్ను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండ గల నా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం || 2 ||
మనసన్నది నీ ధ్యాన లోనే
తనువున్నది నీ సేవ లోనే || 2 ||
ప్రతి నోట నీ చరణ నామం
నా నోటే నీ మధుర గానం
నా నోటే నీ మధుర గానం || నిన్ను చూడక.... 2 ||
ఆ బ్రహ్మకు నీ రుణపడనా
రాత రాశాడు నిను చూడగా || 2 ||
కనిపించే దైవాలు తల్లిదండ్రు లై
జన్మనిచ్చారు ఏనాటి ఫల మో
జన్మనిచ్చారు ఏనాటి ఫల మో || నిన్ను చూడక.... 2 ||
ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు
ఇక రాకుండా నువ్వు చూడవా || 2 ||
ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవింతునయ్యా
ఇక మరుజన్మ నాకివ్వకయ్య
ఇక మరుజన్మ నాకివ్వకయ్య || నిన్ను చూడక.... 2 ||
0 Comments