గణ గణ గంటలు ఘనముగా మ్రోగంగ
గణ గణ గంటలు ఘనముగా మ్రోగంగ
అయ్యప్ప నీ అభిషేకము జరుగంగా
కోటొక్క భక్తులు పాటలు వాడంగ
అబ్బబ్బ శబరిమల ధగ ధగ మెరిసే ఆ కోవెల
మణికంట నీ క్షేత్రము జూడ ముచ్చటగా
మణికంట నీ రూపము కన్నుల విందంటా
అల శబరీ శిఖరానా అంతెత్తు కొండల పైన
స్వర్ణ మందిర నిలయం అయ్యప్పా నీ దివ్య రూపం
చూసిన భాగ్యమటా నిన్ను కొలిచిన పుణ్య మటా
అయ్యప్పా అభిషేక ప్రియ మా అయ్యప్పా
అయ్యప్పా అలంకార ప్రియ అయ్యప్పా
అద్భుత మహిమల వాడా మా ఆపద్భందువు నీవే
మహిషిని కూల్చిన వాడా మా మంచి మార్పువు నీవే
నీదు భక్తిలోనా మాకు ముక్తి కలిగేనయా
మణికంట మా భారము అంతా నీదంతా
మణికంట నువ్వు లేని నేను లేనంటా
కుల మత భేదాలు లేక నీ మాలను వేసినమయ్య
సత్యము ధర్మమూ మాలో అణువణువున నిలిపిన మయ్యా
గుండె నిండా భక్తీ నింపి నీ గుడికొచ్చినము
శత కోటి భక్తులు నీ శబరి చూడంగా
ఆనందం పరమానందం అయ్యే నయ్యా
మరిన్ని అయ్యప్ప భజనలు చూడండి.
0 Comments