లేవయ్య లేవయ్య లేచిరావయ్యా Levayya Levayya Lechi ravayya - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 

లేవయ్య లేవయ్య లేచిరావయ్యా Levayya Levayya Lechi ravayya - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


లేవయ్య లేవయ్య లేచిరావయ్యా

లేవయ్య లేవయ్య లేచిరావయ్యా
 వేచి ఉన్నా మయ్య లేచి చూడయ్యా

దేవతలు కోరగా మానవుడవై పుట్టి
మహిషిని వధియించి మాయమైన వంట

ధర్మాన్ని కాపాడు  ఓ ధర్మశాస్త్ర
 పులిపాలు తెచ్చావు ఓ పుణ్య మూర్తి

కొండ గుట్టలు దాటి మేము వచ్చాము
మా కోరికలు తీర్చ గా లేచి రా స్వామి


మానవ జన్మ ఎత్తి పాపాలు చే సేము
 పుణ్యాన్ని కోరుతూ నీ కొండకు వచ్చేము


సన్నిధానం చేరి చాలాసేపు అయింది
లేచి కూర్చో స్వామి మేము చూస్తాము


ఆవు నెయ్యి తెచ్చాము అభిషేకమునకు
అటుకులు తెచ్చాము ఆరగించవ య్యా


మోగింది మోగింది గుడిలోని గంట
 స్వామివారు నిద్రలేచి నారంట


అదిగదిగో చూడండి అయ్యప్పస్వామి
శబరి పీఠం మీద చిన్ముద్ర దారి

తెచ్చిన ముడుపులను స్వామికి ఇవ్వండి
మీ పాప భారాన్ని తగ్గించుకోండి


మా తల్లిదండ్రులను కాపాడు స్వామి
మా అన్నదమ్ములను ఆదరించ వయ్యా


మా ఆడపడుచులను కాపాడు దేవా
మా బంధుమిత్రులను కరుణించ వయ్యా


మా భార్య పిల్లలను కాపాడు స్వామి
మళ్లీ వచ్చే ఏడు నీ కొండకు వస్తాము

స్వామియే శరణం శరణం అయ్యప్ప
నీ నామమే మాకు శ్రీరామరక్ష

Post a Comment

0 Comments

Close Menu